Telugu Lyrics Hub

Explore lyrics of your favorite Telugu songs!


samavaragamana

Samajavaragamana

Movie: Ala Vaikunthapurramuloo

Singers: Armaan Malik



నీ కాళ్ళను పట్టుకు వదలనన్నవి చూడే నా కళ్ళు
ఆ చూపులనలా తొక్కుకు వెళ్ళకు దయలేదా అసలు

నీ కాళ్ళను పట్టుకు వదలనన్నవి చూడే నా కళ్ళు
ఆ చూపులనలా తొక్కుకు వెళ్ళకు దయలేదా అసలు

నీ కళ్ళకు కావాలి కాస్త ఏ కాటుకలా నా కలలు
నువ్వు నులుముతుంటే ఎర్రగ కంది చిందేనే సెగలు  

నాఊపిరి గాలికి ఉయ్యాలలూగుతూ ఉంటె ముంగురులు
నువ్వు నెట్టేస్తే ఎలా నిట్టూర్చవటే నిష్టూరపు విలవిలలు

సామజవరగమనా నిను చూసి ఆగ గలనా
మనసు మీద వయసుకున్న అదుపు చెప్పతగునా..

సామజవరగమనా నిను చూసి ఆగ గలనా
మనసు మీద వయసుకున్న అదుపు చెప్పతగునా..

నీ కాళ్ళను పట్టుకు వదలనన్నవి చూడే నా కళ్ళు
ఆ చూపులనలా తొక్కుకు వెళ్ళకు దయలేదా అసలు

మల్లెల మాసమా
మంజుల హాసమా
ప్రతి మలుపులోన ఎదురు పడిన వెన్నెల వనమా

విరిసిన పింఛమా
విరుల ప్రపంచమా
ఎన్నెన్ని వన్నె చిన్నెలంటే.. ఎన్నగ వశమా ..

అరే నా గాలే తగిలినా
నా నీడే తరిమినా
ఉలకవా పాలకోవా భామా...

ఎంతో బ్రతిమాలినా
ఇంతేనా అంగనా
మదిని మీటు మధురమైన మనవిని వినుమా

సామజవరగమనా నిను చూసి ఆగ గలనా
మనసు మీద వయసుకున్న అదుపు చెప్పతగునా..

సామజవరగమనా నిను చూసి ఆగ గలనా
మనసు మీద వయసుకున్న అదుపు చెప్పతగునా..

నీ కాళ్ళను పట్టుకు వదలనన్నవి చూడే నా కళ్ళు
ఆ చూపులనలా తొక్కుకు వెళ్ళకు దయలేదా అసలు

నీ కళ్ళకు కావాలి కాస్త ఏ కాటుకలా నా కలలు
నువ్వు నులుముతుంటే ఎర్రగ కంది చిందేనే సెగలు   




Back to Telugu Songs

Top Telugu Songs



Top Artists


Sachet–Parampara

Sachet–Parampara

Sachet–Parampara

Sachet–Parampara

Follow Us